ఇక పాఠ్యాంశాలలో తెలంగాణం

0
school
Advertisement

school

Advertisement

ఒకటి నుంచి పదో తరగతి దాకా అమలు టీఎస్‌సీఈఆర్‌టీ ప్రతిపాదనకు సర్కారు ఓకే

ఒకటి నుంచి పదో తరగతి వరకు లాంగ్వేజెస్‌, సోషల్‌ స్టడీస్‌ పాఠ్యపుస్తకాల్లో తెలంగాణ అంశాలను చేర్చేందుకు కసరత్తు జరుగుతోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ మేరకు అవసరమైన మార్పులు, చేర్పులు చేయనున్నారు. తెలంగాణ నాగరికత, పండుగలు, భౌగోళిక చరిత్ర, సంస్కృతి, కవులు, వారసత్వ సంపద, తదితర అంశాలను పాఠ్యాంశాలుగా చేర్చేందుకు అవసరమైన ప్రతిపాదనలను తాజాగా తెలంగాణ రాష్ట్ర విద్యా, పరిశోధన శిక్షణ మండలి (టీఎస్‌సీఈఆర్‌టీ) సర్కారుకు ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలోని అంశాలను పరిశీలించిన అనంతరం తెలంగాణకు సంబంధించిన పలు ఇతర అంశాలను కూడా చేర్చుతూ విద్యా మంత్రి జి.జగదీశ్‌రెడ్డి పలు సూచనలు చేశారు. సంబంధిత ఫైల్‌పై మంత్రి సంతకం చేసి, సీఎం కేసీఆర్‌కు పంపినట్లు సమాచారం. ముఖ్యంగా తెలుగు పాఠ్య పుస్తకంలో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన కవులు, చరిత్ర, సంస్కృతి, పండుగలు, భౌగోళిక అంశాలే ఎక్కువగా ఉన్నట్లు గుర్తించిన అధికారులు, వాటి స్థానంలో తెలంగాణ రాష్ట్ర ప్రాధాన్య అంశాలను చేర్చాలని ప్రతిపాదించారు. తెలంగాణ కవుల్లో దాశరథి కృష్ణమాచార్య, పండుగల్లో బోనాలు, బతుకమ్మలను పాఠ్యాంశాలుగా చేర్చాలని భావిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే తెలంగాణ అంశాలను పాఠ్యపుస్తకాల్లో ప్రవేశపెట్టాలని తొలుత భావించినప్పటికీ, సమయాభావం కారణంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమ లు చేసేందుకు వీలుగా కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం.

Advertisement