ఈశ్వరి భాయి వర్ధంతి ని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం

0
Advertisement

GEETA REDDY MET HON'BLEL CM (1)

Advertisement

హైదరాబాద్, జనవరి 19 (టెలిమిడియా) : దివంగత మాజీ రిపబ్లిక్ పార్టీ అద్యక్షురాలు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాతలలొ ఒకరైన ఈశ్వరి భాయి వర్ధంతి ని వచ్చే నెల ఫిబ్రవరి 24న రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈశ్వరి భాయి కుమార్తె, మాజీ మంత్రి కాంగ్రెస్ నాయకురాలైన జె. గీతా రెడ్డి నేడు ముఖ్యమంత్రిని సచివాలయం లో కలిసి విజ్ఞప్తి చేసింది. దీనికి ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు స్పందిస్తూ ఈశ్వరి భాయి యొక్క ప్రసంగాలు తనకు  ఎంతో స్పూర్తినిచ్చాయని,  తెలంగాణా కోసం ఆమె ఎంతో తపన పడిందని చెప్పారు. ఆమె జీవిత చరిత్రను పాఠ్యాంశాలల్లో  పొందుపరుస్తామని వెల్లడించారు.

GEETA REDDY MET HON'BLEL CM (2)

GEETA REDDY MET HON'BLEL CM (3)

GEETA REDDY MET HON'BLEL CM (4)

Advertisement