ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ గా విద్యార్తి నాయకుడు పిడమర్తి రవి నియామకం

0
Advertisement

YSF_4953

Advertisement

హైదరాబాద్, డిసెంబర్ 3 (టెలిమిడియా) : ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జాక్ నాయకుడు పిడమర్తి రవి నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైనారు. నేడు ఈ మేరకు సిఎమ్ చంద్రశేఖర్ రావు సమక్షంలో పంచాయత్ రాజ్ మంత్రి కేటిఅర్ ప్రభుత్వ ఉత్తర్వులను ఆయనకు అందచేసారు. దీనితో సంతోషం పట్టలేక పిడమర్తి రవి సిఎమ్ ను కౌగిలించుకున్నరు. సిఎమ్ కూడా అదే ఆప్యాయతతో రవిని స్వీకరించారు. ఖమ్మం జిల్లాకు చెందినా రవి ఉద్యమంలో మమేకమై జాక్ నాయకుడిగా చురుకైన పాత్ర పోషించారు. ఈ కార్యక్రమంలో టిఅరెస్ ఎమెల్యేలు రసమై బాలకిషన్, ఏనుగు రవీందర్ రెడ్డి మరి ఇతర నాయకులూ పాల్గొన్నారు.  

YSF_4946

Advertisement