కంటోన్మెంట్ బోర్డులో అవినీతి ఊట

0
Advertisement

images_0చెల్లింపులు, జమా పత్రాలు ఉండవు
-నిధుల దుర్వినియోగంపై వెల్లువెతుతున్న ఆరోపణలు
కంటోన్మెంట్, జూలై 9(టీ మీడియా) : సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో అవినీతి రాజ్యమేలుతోంది. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ అధీనంలో కంటోన్మెంట్‌లో పరిపాలన నడుస్తోంది. చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడం.. బోర్డు అధికారులకు తెలిసినట్లు మరే ఇతర అధికారులకు తెలియదంటే అతీయోశక్తికాదు. బోర్డు పరిధిలోని ఆయా విభాగాల్లో జరుగుతున్న తప్పులను నిరోధించాల్సిన కార్యానిర్వహణాధికారి సైతం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తుండడంతో ఆమెపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

అంతా ఆవినీతిమాయం…
ఇక్కడ వసూలు చేసిన పన్నులకు లెక్కాపత్రాలుండవు. చెల్లించిన సొమ్ములకు రశీదులుండవు.. పంప్‌హౌజ్‌ల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారవుతోంది.. ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏలో అవకతవకలు జరుగుతుంటాయి.. వాడకం తేదీని దాటిన మందులను రోగులకు సరఫరా చేస్తుంటారు. మ్యాన్‌హోల్ కవర్లు, మంచినీటి పైపులు, లైమ్ ఫౌడర్, ఫినాయిల్, ఎలక్ట్రికల్ వస్తువుల కొనుగోళ్లలో అవినీతి కంపు కొడుతోంది. పైన పేర్కొన్న వాటిల్లో దాదాపు ఆర కోటి వరకు కుంభకోణం జరిగినట్లు ప్రధాన ఆరోపణలున్నాయి. గతేడాది బోనాల జాతర పేరిట రూ.

2 లక్షలపైగా నిధుల దుర్వినియోగంపై బోర్డు వైనాన్ని.. సాక్షాత్తు మిలటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్ (ఎంఈఎస్) సికింద్రాబాద్ రీజినల్ ఆడిట్ ఆఫీస్(ఆర్‌ఏఓ) తప్పుబట్టడం గమనార్హం. పారదర్శకంగా పాలన అందిస్తున్నట్లు గొప్పలు చేప్పుకునే అధికారులు బోర్డులో జరుగుతన్న అవకతవకలపై అడిట్ కార్యాలయం గత మూడు నెలలుగా వివరణ ఇవ్వాలని కోరుతున్న పట్టించుకోవడంలేదని తెలిసింది. అయితే ఈ విషయమై సీఈఓ సుజాతగుప్తాను వివరణ కోరేందుకు టీ మీడియా ఫోన్‌లో సంప్రదించగా లేరని సమాధానం వస్తుంది.

మచ్చుకు కొన్ని సంఘటనలు..
-గతేడాది బోనాల జాతర కోసం పండగ జరిగే ఆలయాల వద్ద మట్టి పోయించేందుకు రూ.2.08 లక్షలు మల్లేష్ అనే కాంట్రాక్టర్‌కు వెచ్చించినట్లు బోర్డు పేర్కొంది. అయితే ఒకే పనికి 10 అర్డర్లు ఎందుకు ఇచ్చారో తెలియజేయాలని, సింగిల్ అర్డర్ కింద డబ్బులు చెల్లించలేదో.. తెలియజేయాలని ఎంఈఎస్ ఆడిట్ కార్యాలయం కోరింది.

– బోర్డు పరిధిలో వినియోగించాల్సిన ఫినాయిల్‌ను చర్లపల్లి కేంద్రకారగారంలో కొనాలని బోర్డు తీర్మానించింది. అక్కడ అందుబాటులో లేని పక్షంలో బెంగాల్ కెమికల్ లిమిటెడ్ అనే సంస్థ నుంచి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే చర్లపల్లి జైలులో 400 లీటర్లకు రూ.45 చొప్పున రూ.18వేలతో కొనుగోలు చేసినట్లు గతంలో చూపించారు. కాగా దానికంటే రెండు రోజుల ముందు ఏహెచ్‌ఎం ఎంటర్‌ప్రైజెస్ అనే సంస్థ నుంచి రూ.27వేలకు 270 లీటర్ల ఫినాయిల్ కొనుగోలు చేసినట్లు చూపించారు. చర్లపల్లి కేంద్రకారగారంలో తక్కువ ధరకు ఫినాయిల్ అందుబాటులో ఉన్నప్పటికీ, బయట ఎందుకు ఎక్కువ మొత్తంలో చెల్లించి కొనుగోలు చేశారో నివేదిక ఇవ్వాలని ఆడిట్ కార్యాలయం కోరింది.

– బోర్డు సీఈఓ 75 బ్యాగుల లైమ్‌పౌడర్‌ను కొనుగోలు చేయాలని సూచించగా, అందుకు విరుద్ధంగా 500 బ్యాగుల లైమ్ పౌడర్ కొనుగోలు చేసినట్లు సూపించారు. అయితే 425 బ్యాగులను ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చిందో సంజాయిషి ఇవ్వాలని ఆడిట్ కార్యాలయం కోరింది.
-మహిత ఎలక్ట్రో టెక్నిక్ అనే సంస్థ నుంచి 375 జీఐ బెండ్ పైపులను రూ.71 వేలతో కొనుగోలు చేసినట్లు రికార్టులో రాసినప్పటికీ, వాటికి సంబంధించిన కొనుగోలు రశీదులు, ఆ పైపులను ఎక్కడ వినియోగించారో లాంటి వివరాలపై వివరణ ఇవ్వాలని ఆడిట్ కోరింది.

-దోమల నివారణకు రూ.2.50 లక్షలతో ఐదు ఫాగింగ్ మెషిన్లు కొనుగోలు కోసమని డెల్టా ఇంజినీరింగ్ కార్పొరేషన్‌కు అర్డర్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. అయితే ఈ కొనుగోళ్లకు ఐదు ఆర్డర్లుగా ఎందుకు విభజించారు. యాభై వేల దాటకుండా, ఆడిట్‌లో పట్టుబడకుండా ఉండేందుకు వేర్వేరుగా ఆర్డర్లు జారీ చేసినట్లు స్పష్టమవుతుందని ఆడిట్ అధికారులు తేల్చేశారు. గతంలో ఉన్న ఫాగింగ్ మెషిన్ల వివరాలను వెల్లడించాలని ఆడిట్ సంజాయిషీ కోరింది.-బోర్‌వెల్స్, డ్రిల్లింగ్ కోస ఎంపీల్యాడ్ ద్వారా అందిన రూ.6,84,781 నిధులు ఎక్కడికెళ్లాయో తెలియదని, వీటి వివరాలను వెల్లడించాలని ఆడిట్ కార్యాలయం కోరింది.

Advertisement