జర్నలిస్టులకు తప్పక న్యాయం చేస్తాం, హరిప్రసాద్ సంతాప సభలో కేటిఆర్

0
Advertisement

IMG_0086

Advertisement
  • సీనియర్ హరిప్రసాద్ కుంబుంబానికి రెండు లక్షల అర్ధిక సహయం
  • ఉద్యమంలో పాల్గోన్న జర్నలిస్టు సమాజానికి ఖచ్చితంగా న్యాయం చేస్తాం
  • జర్నలిస్టుల హెల్త్ కార్డులు, అక్రిడేషన్ కార్డులను ఇప్పించేందుకు తాను చోరవ చూపుతా
  • హరి ప్రసాద్ కుంటుబానికి అండగా ఉంటామని, వారి పిల్లల చదువుకయ్యే ఖర్చు
  • తనను ఓ సోదరుడిగా, సహచర ఉద్యమ కారుడిగా నే భావించాలన్న కెటియార్

IMG_0046

హైదరాబాద్, ఫిబ్రవరి 12 (టెలిమిడియా) : తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కె. తారక రామా రావు తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వతా ఉద్యమంలో పాల్గోన్న ప్రతి ఓక్కరికి న్యాయం చేస్తున్నదని, పేద ప్రజల కోసం పెంచన్లు, ఉద్యోగులకి  పిఅర్ సి పెంపు, కళాకారులకి ప్రత్యేకంగా సమాచారా సాంసృతిక వారధి ఏర్పటు చేయడం వంటి చర్యలు తీసుకున్న మాదిరే, ఉద్యమంలో పాల్గోన్న జర్నలిస్టు సమాజానికి ఖచ్చితంగా న్యాయం చేస్తామని పంచాయితీ రాజ్ శాఖ మంత్రి తారక రామా రావు తెలిపారు. సమాచార శాఖకి ప్రత్యేకంగా మంత్రి లేకున్నా తాను వ్యక్తిగతంగా చోరవ చూపుతానన్నారు.  తమ ప్రభుత్వం ఇప్పటికే జర్నలిస్టుల సంక్షేమం కోసం10 కోట్లు బడ్జెట్ లో పెట్టినామని అయినా అవసరమైతే మరింత సహయం చేస్తామని హమీ ఇచ్చారు.

IMG_0060

జర్నలిస్టుల అడుగుతున్న హెల్త్ కార్డులు, అక్రిడేషన్ కార్డులను ఇప్పించేందుకు తాను చోరవ చూపుతానని,  ఇందుకు సంభందించి జర్నలిస్టు నాయకులు ఓక పక్కా ప్రతిపాదనతో ముందుకు రావాలని కోరారు. జర్నలిస్టులతో పాటు వారి కుంటుంబానికి సహయపడేలా ఉండే విధంగా, ముఖ్యమంత్రితో చర్చించి జర్నలిస్టులు ఇచ్చే ప్రతిపాదనపై అనుమతి తీసుకుంటామని తెలిపారు. జర్నలిస్టులకి సంక్షేమం కోసం ప్రభుత్వం మద్దతు ఏప్పుడు ఉంటుందని, అయినప్పటికీ కొంత సహయం యాజమాన్యలనుంచి కూడా రావాలి అయన తెలిపారు.

IMG_0066

తెలంగాణ ఉద్యమ కాలంలో, తమ పార్టీ ప్రస్ధానంలో ప్రతి సందర్భంలోనూ తెలంగాణ జర్నలిస్టుల అండగా ఉన్నారని, వారి సేవలు, మద్దతుని ఏప్పటికీ మరిచిపోలేమన్నారు. తాము చేసిన ఉద్యమాన్ని ప్రజలకి చూపిన క్రెడిట్ జర్నలిస్టులకే దక్కుతుందని, తమతో కలిసి ఉద్యమం చేసిన జర్నలిస్టుల రుణం ఖచ్చితంగా తీరర్చుకుంటామని మంత్రి తెలిపారు. తాము ఇప్పుడు పదవుల్లోకి వచ్చినంత మాత్రనా జర్నలిస్టులతో ఉన్న మానవసంభందాలు ఏమాత్రం మారలేవని, ఏప్పటికి తనను ఓ సోదరుడిగా, సహచర ఉద్యమ కారుడిగా నే భావించాలని కోరారు.  తమకి జర్నలిస్టుల మీద గౌరవం ఏప్పుడు తగ్గదని మంత్రి తెలిపారు.

IMG_0044

గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన సీనియర్ జర్నలిస్టు  హరిప్రసాద్ సంస్మరణ సభకి హజరయిన మంత్రి హరిప్రసాద్ కుంబుంబానికి రెండు లక్షల అర్ధిక సహయాన్ని అందించారుర. హరి ప్రసాద్ కుంటుబానికి అండగా ఉంటామని, వారి పిల్లల చదువుకయ్యే ఖర్చుని పూర్తిగా వ్యక్తి గతంగా బరిస్తానని మంత్రి కె.తారక రామరావు హమీ ఇచ్చారు.

IMG_0069

Advertisement