ప్రభుత్వం తరపున ఒబామాను హైదరాబాద్ కు ఆహ్వానించిన కేటిఅర్

0
Advertisement

DSC_7573

Advertisement

– అమెరికా ప్రతినిధి బృందంతో సమావేశమైన ఐటి మంత్రి కెటి రామారావు

 -పెట్టుబడులకి హైదరాబాద్ అకర్షనీయమైన నగరం

– డిఫెన్స్ మరియు ఏరోస్పెస్ రంగాలకి అనువైనా పరిస్ధితులు

హైదరాబాద్, డిసెంబర్ 2 (టెలిమిడియా) : పంచాయితీరాజ్ మరియు ఐటి శాఖా మంత్రిని అమెరికా ప్రతినిధి బృదం నేడు సచివాలయంలో కలిసింది. వచ్చేనెల భారత దేశానికి రాబోతున్నా అమెరికా అద్యక్షుడు ఓబామాని హైదరాబాద్ పర్యటించాల్సిదిగా కోరడం జరిగింది. ఉత్తర భారత దేశంకన్నా అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన దక్షిన భారత దేశం అందునా హైదరాబాద్ కి అద్యక్షుడి రావడం వల్ల నిజమైన భారత దేశ  ప్రగతి తెలుసుకునే అవకాశం కలుగుతుందని అమెరికా ప్రతినిధి బృందానికి తెలియజేశారు. హైదరాబాద్ కి ఉన్న చారిత్రాక నేపథ్యం, సాంకేతిక, పారిశ్రామిక రంగాల్లో జరిగిన అభివృద్ధిని మంత్రి అమెరికా ప్రతినిధి బృందానికి వివరించారు. వారం రోజుల కిందా నేషనల్ ట్రావెల్ మ్యాగజైన్ హైదరాబాద్ ని రెండో అత్యుత్తమ నగరంగా ప్రకటించిన విషయాన్ని అయన తెలిపారు.

DSC_7576

Puneet Talwar, Assistant Secretary of State for Political Military Affairs నేతృత్వంలో వచ్చిన ప్రతినిధి బృందం  పలు అంశాల మీద చర్చించారు. భారతదేశంతో వాణిజ్యపరమైన సంబంధాలను విస్తృతం చేసుకునేందుకు అమెరికా సిద్ధంగా ఉందని ప్రతినిధి బృదం తెలిపింది. Puneet Talwarతో పాటు,  Kenneth Handelman, Deputy Assistant Secretary of State in Defense Trade Controls Office,  Atul Keshap, Deputy Assistant Secretary of State for South and Central Asia., Michael Mullins, Consul General, US Consulate General Hyderabad., Peter McSharry, Political and Economic Officer, US Consulate General Hyderabad, K. Srimali, Political and Economic Specialist లు అమెరికన్ ప్రతినిధి బృదంలో ఉన్నారు.

DSC_7581

హైదరాబాద్ లో ఉన్న వ్యాపార అవకాశాలను మంత్రి అమెరికా ప్రతినిధులకి తెలియజేశారు. అమెరికా అనుమతించే అత్యదిక హెచ్ 1బి వీసాలు అధికం

గా హైదారాబాద్ నుంచే ఉన్నాయంటే ఇక్కడ ఉన్న నిపుణుల అవకాశాలను తెలుపుతుందన్నారు. ఇక ప్రస్తుతం అమెరికాతోపాటు వివిధ యూరరోప్ దేశాలు అధిక ప్రాధాన్యం ఇస్తున్న డిఫెన్స్&ఏరోస్పెస్ విభాగాల్లో హైదరాబాద్ ప్రస్తుతం అత్యంత వేగంగా అభివృదృధ్ది చెందుతున్న నగరమని తెలిపారు. హైదరాబాద్ లో సూమారు 15 రక్షణ సంస్ధలు, రెండు ఏయిర్ పొర్ట్ లతో, అద్బుతమైన యాన్సిలియరీ యూనిట్స్ తో హైదారాబాద్ డిఫెన్స్&ఏరోస్పెస్ రంగంలో పటిష్టంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం భారతదేశంలో జరుగుతున్న ప్రతిష్టాత్మక డిఫెన్స్&ఏరోస్పెస్ ప్రాజెక్టుల్లో హైదరాబాద్ సంస్ధలకి భాగసామ్యం ఉంటుందని, అంగారకుడిపైకి పంపిన మామ్ ప్రాజెక్ట్, బ్రహ్మోస్ లాంటి వాటికి పరికలందించిన విషయాన్ని అమెరికన్ బృందానికి తెలియజేశారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న రెండు డిఫెన్స్&ఏరోస్పెస్ క్లస్టర్లతో పాటు మరోకదాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని పరీలిస్తునన్నామని తెలిపారు.

DSC_7594

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పారిశ్రామిక విధానంతో అతి తక్కువ సమయంలో అన్ని అనుమతులు ఇవ్వడం వంటి అంశాలను వారికి తెలియజేశారు. తాము అధికారంలోకి వచ్చిన సరిగ్గా అరునెలలే అయినప్పటికీ పరిశ్రామిక వర్గాలకి సహకారం అందించడంలో ముందున్నామని తెలిపారు. తాము ఇస్తున్న సహకారం వల్ల అనేక కంపెనీలు పెట్టుబడులతో ముందుకు వస్తున్న విషయాన్ని తెలియజేశారు. డిఫెన్స్&ఏరోస్పెస్ రంగంలోనే తమ ప్రభుత్వం వచ్చినాక టాటా కంపెనీ మెదటి పెద్ద పరిశ్రమ హైదారాబాద్కి వచ్చినట్టు తెలిపారు.

DSC_7596

తెలంగాణ రాష్ర్టంతో పెట్టుబడులు పెట్టే కంపెనీలకి పూర్తి సహకారం అందిస్తామని తెలిజేశారు. తెలంగాణలో పెట్టుబడులకి ఉన్న సానూకూల వాతావరణాన్ని తెలియజేసేందుకు వివిధ దేశాల్లో ప్రచారం చేసేందుకు తాము సిధ్దం ఉన్నామని తెలియజేశారు.

DSC_7599

DSC_7602

Advertisement