మాస్ మాహారాజ రవితేజ -తమన్నాకాంబినేషన్లో నూతన చిత్రం ‘బెంగాల్ టైగర్’ త్వరలో

0
Advertisement
raviteja-bengaltiger
హైదరాబాద్, నవంబర్ 15, (ఆరెస్ పి నెట్వర్క్) : బలుపు, పవర్ వంటి వరుస సూపర్ హిట్ చిత్రాలతో మాంచి ఊపుమీదున్న మాస్ మహరాజ రవితేజ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కిక్ 2 అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే రచ్చ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన సంపత్ నంది దర్శకత్వంలో నటించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రానికి బెంగాల్ టైగర్ అనే పవర్ ఫుల్ టైటిల్ ఖరారు చేశారు. కిక్ 2 చిత్రాన్ని పూర్తి చేసిన వెంటనే బెంగాల్ టైగర్ షూటింగ్ ప్రారంభిస్తారు. ఇక ఈ చిత్రాన్ని ఏమైంది ఈవేళ, అధినేత, ప్యార్ మే పడిపోయానే వంటి ప్రేక్షకాదరణ పొందిన చిత్రాల్ని అందించిన అభిరుచి గల నిర్మాత కె కె రాధామోహన్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్లో ప్రతిష్టాత్మకంగా రవితేజ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అందాల ముద్దుగుమ్మ మిల్కీ బ్యూటీ తమన్నా రవితేజ సరసన నటిస్తోంది. ఫిబ్రవరిలో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. సాంకేతిక నిపుణులు, ఇతర తారాగణం వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని నిర్మాత తెలిపారు.
tamanna
ఈ సినిమా గురించి హీరో రవితేజ మాట్లాడుతూ సంపత్ నంది చెప్పిన కథను సింగిల్ సిట్టింగ్ లో ఓకే చేశాను. సంపత్ నంది అందరినీ ఎంటర్ టైన్ చేయగల సత్తా ఉన్న పవర్ ఫుల్ డైరెక్టర్. ఫుల్ మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్ర కథను తీర్చిదిద్దుతున్నాడు. అన్ని వర్గాల్ని ఆకట్టుకునే కథ ఇది. మాస్ ఎలిమెంట్స్‌తో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. కమర్షియల్ సినిమాకు కావాల్సిన అంశాలన్నీ ఈ చిత్రంలో ఉంటాయి. కిక్-2 షూటింగ్ పూర్తయిన వెంటనే ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. కథకు తగ్గట్టుగా ఈ చిత్రానికి పవర్ ఫుల్ టైటిల్ బెంగాల్ టైగర్ అనే టైటిల్ ఖరారు చేశాం. నిర్మాత రాధామోహన్ సినిమాల మీద ప్యాషన్ ఉన్న వ్యక్తి. ఆయన బ్యానర్లో సినిమా చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అని అన్నారు.
kk radhamohan
నిర్మాత కె కె రాధామోహన్ మాట్లాడుతూ…. ఏమైంది ఈవేళ, అధినేత, ప్యార్ మే పడిపోయానే వంటి మోస్తరు బడ్జెట్ చిత్రాలు నిర్మించిన నాకు మాస్ మహారాజ రవితేజ అవకాశం ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయనకు రుణపడి ఉంటాను. ఆయన మా మీద పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేశాం. సంపత్ నంది చెప్పిన కథ అన్ని వర్గాల్ని ఆకట్టుకునేలా ఉంటుంది. మా బ్యానర్ ప్రతిష్టను మరింత పెంచే దిశగా సంపత్ కష్టపడుతున్నాడు. ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. కథకు తగ్గట్టుగా బెంగాల్ టైగర్ అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టాలని నిర్ణయించాం. టైటిల్ కు తగ్గట్టుగానే హీరో క్యారెక్టరైజేషన్ డిజైన్ చేశాం. ఫిబ్రవరిలో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభిస్తాం. అందాల భామ తమన్నా రవితేజతో జోడీ కడుతోంది. ఇతర తారాగణం, టెక్నీషియన్స్ వివరాలు మరికొద్దిరోజుల్లో తెలియజేస్తాం. అని అన్నారు.
దర్శకుడు సంపత్‌నంది మాట్లాడుతూ… మాస్ మహరాజ్ రవితేజతో సినిమా చేయాలన్న తన కోరిక ఈ సినిమాతో తీరుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. సినిమాల మీద అభిరుచి ఉన్న నిర్మాత కె కె రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయన ఖర్చుకు వెనకాడకుండా ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేశారు. రవితేజ ఎనర్జిటిక్ పెర్ ఫార్మెన్స్ కు తగ్గట్టుగా ఈ చిత్ర కథ సిద్ధమైంది. అంతే పవర్ ఫుల్ గా ఉండేలా బెంగాల్ టైగర్ అనే టైటిల్ పెట్టాం. రవితేజ, తమన్నా మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలుస్తాయి. రవితేజ నుంచి ప్రేక్షకులు ఆశించే అన్ని ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉంటాయి. రవితేజ ఫ్యాన్స్ ఆశించే మాస్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దుతున్నాం. నా మీద నమ్మకంతో సింగిల్ సిట్టింగ్ లో కథను ఓకే చేసిన రవితేజ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ తుది దశకు చేరుకుంది. రవితేజ కిక్ 2 పూర్తయిన వెంటనే ఈ బెంగాల్ టైగర్ సెట్స్ మీదకు వెళ్తుంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తాం. అని అన్నారు.
Advertisement