వాటర్ గ్రిడ్ పై పంచాయితీ రాజ్ శాఖా మంత్రి సమీక్ష, 592 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్  

0
Advertisement

IMG_1029

Advertisement

హైదరాబాద్, నవంబర్ 25, (టెలిమీడియా): వాటర్ గ్రిడ్ ప్రాజెక్టకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని పంచాయితీ రాజ్ శాఖా మంత్రి కె. తారకరామారావు అన్నారు. ప్రజలకు నీళ్లిచ్చిన ప్రభుత్వాన్ని ప్రజలకు పదికాలాలు గుర్తించుకుంటారి, దీనికి ఇరవై సంవత్సరాల కింద సిద్దిపేటకి నీళ్లందించిన ముఖ్యమంత్రిని ఇప్పటికి గుర్తుంచుకొవడం ఉదాహరణ అన్నారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించేందుకు సిధ్ధంగా ఉందని రూరల్ వాటర్ వర్స్క్ శాఖా  సిభ్బందికి హమీ ఇచ్చిన అయన, ప్రాజెక్టు పూర్తి చేసేందుకు వేగంగా పని చేయాలని సూచించారు.

IMG_1037

ఈ రోజు అర్ డబ్యూ ఏస్  ఈ ఏన్ సి అఫీసులో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ప్రాధాన్యత గుర్తించి ఉద్యోగులకి వాహన సదుపాయంతో పాటు , ల్యాప్ ట్యాప్ లాంటి సౌకర్యాలను అమెదించిందని తెలిపారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట వేగంగా పూర్తి చేసేందుకు శాఖలో ఉన్న అన్ని డిప్యూటేషన్లను రద్దు చేయాలాని అదికారులను అదేశించారు. ఖాళీగా ఉన్న 592 ఉద్యగాల భర్తీకి ప్రభుత్వం అమెదం తెలిపిందన్నారు.  సమీక్ష సమావేశంలో జిల్లాల్లా వారిగా ఏస్ ఈలతో ప్రత్యేకంగా అయా జిల్లాలోని గ్రిడ్ల వారీగా సమీక్ష నిర్వహించారు. గ్రిడ్ లైన్ సర్వే త్వరలోనే పూర్తవుతుందని, అయితే అవసరమైన చోట భూము అక్విజిషన్ వివరాలను ఓకటి రెండు రోజుల్లో అందించాలని కోరారు. ఇక 26 గ్రిడ్ తాలుకు కార్యాలయాలను వేంటనే ఏర్పాటు చేయాలని, ఇందుకు అన్ని సౌకర్యాలున్న భవనాలను అద్దెకి వేంటనే తీసుకుని, కార్యాలయాల్లో పూర్తి స్దాయి సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలని అధికారులను అదేశించారు. ప్రతి కార్యాలయంలో విడియో కాన్ఫరెన్ను సౌకర్యాలుండాలని, ఇక్కడి అర్ డబ్యూఏస్ కార్యాలయంతో పాటు, మంత్రి, ముఖ్యమంత్రి పేషీలనుంచి ప్రాజెక్టు కార్యకలాపాలను ఏప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని అదికారులకు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల తర్వతా ముఖ్యమంత్రి స్వయంగా క్షేత్ర స్ధాయిలో జిల్లాల్లో పర్యటిస్తారని, అదికారులు పూర్తి సమాచారం, అవగాహనతో సిద్దంగా ఉండాలని కోరారు. తనతోపాటు ఇతర ఉన్నతాధికారులు ప్రతి పదిహేను రోజులకోసారి జిల్లాల్లో పర్యటిస్తామని, వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట పనులను పరీశీలించాని ముఖ్యమంత్రి అదేశించారన్నారు.

IMG_1041

సమీక్షలో మాట్లాడిన మంత్రి కెటి రామారావు అదికారులకు పలు అదేశాలిచ్చారు. ప్రాజెక్టు పనుల కోసం అవసరమై నిపునుల కోసం జాతీయా స్థాయిలో ప్రకటనలిచ్చి అవసరమయితే ప్రయివేటు సెక్టార్ లో పని చేస్తున్న వారిని నియమించుకోవాలని అదేశించారు. ఇక జిల్లాల్లో పని చేస్తున్న సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షనిచ్చి,  ప్రాజెక్టు ప్రాధాన్యతని తెలిపేలా, పూర్తి అవగాహన కల్పించాలని కోరారు. ఇప్పటికే పూర్తయిన గ్రిడ్ల వారీ పరిధుల సమాచారాన్ని వేంటనే అధికారులకి అందించాలని కోరారు. మెదటి అరుగ్రిడ్లకి టెండర్ల ప్రక్రియ జనవరి 30 నాటికి పూర్తి చేసి పనులను పిబ్రవరి10 నుంచి ప్రారంబించేలా చూడాలన్నారు. వచ్చే నెలలోనే మఖ్యమంత్రి లాంచనంగా నల్గోండలోని మునుగోడులో శంఖు స్ధాపన చేస్తారని , ఫైలాన్ నిర్మానాన్ని, డిజైన్ని పూర్తి చేయాలని అదేశించారు. కార్పోషన్ ఏర్పాటు వచ్చే వారంలోగా పూర్తి చేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీని అదేశించారు. గ్రామాల్లో ఏర్పాటు చేసే వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట కమీటీల్లో పూర్తిగా మహిళలు ఉండేలా మార్గదర్శకాలు తయారు చేయాలని తెలిపారు. ఇక ప్రతి ఇంటికి సమానంగా ప్రెషర్ తో వాటర్ వచ్చేలా సాంకేతికంగా ఏర్పాట్లు చేయాలని కోరిన మంత్రి , ఇందుకొసం అవసరమై వాటర్ జెమ్ లాంటి సాప్ట్ వేర్ లను కోనుగోలు చేయాలన్నారు.  లైన్ సర్వేకోసం లైడర్ పరిజ్ఘానం వాడాలని నిర్ణయం

సమీక్షలో  అర్ డబ్యూ ఏస్ ఈఏన్ సి సురేందర్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ రేమండ్ పీటర్లతో పాటు జిల్లాల ఏస్ ఈలు , ఇతర ఉన్నతాదికారులున్నారు.

IMG_1034

Advertisement