సమయ పాలన పాటించకుంటే ఉపేక్షించేది లేదు- పంచాయితీ రాజ్ శాఖ మంత్రి

0
Advertisement

DSC_0062

Advertisement

–      సచివాలయంలోని పంచాయితీ రాజ్ సెక్షన్లో ఆకస్మిక తనీఖీ

–      మెత్తం 21 మంది సెక్షన్ అఫీసర్లకి గాను కేవలం 4గురు మాత్రమే సకాలంలో హజరు

–      ఉద్యోగుల తీరుపై పంచాయిత్ రాజ్ శాఖ మంత్రి అగ్రహం

–      ప్రభుత్వం ఎంప్లాయి ప్రెండ్రీ ప్రభుత్వమైనా, ప్రజల కోణంలో ఉద్యోగులు సమయపాలనపై రాజీ లేదు

–      ముఖ్యకార్యదర్శి నుంచి గ్రామ కార్యదర్శి దాక సమయపాలన పాటించాల్సిందే

–      ఐటి శాఖలో త్వరలో బయోమెట్రిక్ విధానం

DSC_0057

హైదరాబాద్ అక్టోబర్ 30 (టేలిమిడియా) : రాష్ర్ట ప్రభుత్వం ఎంప్లాయి ప్రెండ్రీ ప్రభుత్వమైనా, ప్రజల కోణంలో ఉద్యోగులు సమయ పాలన, క్రమశిక్షన పాటించకపోతే సహించేది లేదని పంచాయిత్ రాజ్ మరియు ఐటీశాఖ మంత్రి కె. తారక రామా రావు తెలిపారు. ప్రజలకి కొత్త రాష్ర్టంలో ఏన్నో ఆశలున్నాయన్న ఆయన ప్రభుత్వ ఉద్యోగులు ఆమేరకి పని చేస్తారని ఆశిస్తున్నారు. సచివాలయంలో  ఉన్న కార్యదర్శి కమీషనర్ నుంచి గ్రామస్ధాయిలో ఉన్న పంచాయితీ కార్యదర్శి దాక పర్యవేక్షణ ఉన్నప్పుడే ప్రజలకి పాలనా ఫలితాలు అందుతాయన్నారు. గురువారం ఉదయం పది గంటల యాబైనిముషాలకి సచివాలయంలోని డీ-బ్లాక్ లో ఆకస్మీక తనిఖీలు చేపట్టారు. అక్కడ ఉన్న పంచాయిత్ రాజ్ , గ్రామీణాభివ్రుద్ధి శాఖ సెక్షన్లను తనీఖీ చేశారు. ఉద్యోగుల హజరు పట్టికలను తనీఖీ చేశారు. దాదాపు పదకొండు కావాస్తున్నా అదికారుల, ఉద్యోగులు తమ స్ధానాలకు చేరుకోక పోవడంపై తీవ్ర ఆగ్రహ వ్యక్తం చేశారు. మెత్తం 21 మంది సెక్షన్ అఫీసర్లకి గాను కేవలం 4గురు మాత్రమే సమయానికి రావడంపై అరా తీసారు. సెక్షన్లలను నడిపించాల్సిన ఏస్ వోలే సమయానిక రాకపోతే ఇతర ఉద్యోగులు ఏలా వస్తారని ప్రశ్నించారు.  ఈ సందర్భంగా ఇతర ఉద్యోగుల పనితీరు,సమయపాలనపై  ప్రిన్సిపల్ సెక్రటరీ రేమండ్ పీటర్ ని మంత్రి ఆరా తీశారు.సమయానికి రాని ఉద్యోగులను రేమండ్ పీటర్ కి రిపోర్ట్ చేయమని అదేశించారు. కేవలం ఉద్యోగుల సమయ పాలన గురించి తెలుసకునేందుకు వచ్చానని, అయితే ఇక్కడ చాల మంది ఉద్యోగులు సమయానిక రాకపోవడం భాద కల్గిస్తుందన్నారు.

Screenshot_2014-10-30-12-22-55

తన అకస్మిక సందర్శన తర్వతా మీడియాతో మాట్లాడిన మంత్రి తమ ప్రభుత్వం ఉద్యోగ ప్రెండ్లీ ప్రభుత్వమైనాప్పటికి క్రమశిక్షణ లేకుంటే, సమయపాలన పాటించకుంటే సహించేది లేదన్నారు. తమప్రభుత్వం ఉద్యోగుల ప్రభుత్వంమని అందుకే ఉద్యోగులకి హెల్త్ కార్డులు, తెలంగాణ ఇంక్రిమెంట్,  పిఅర్సీ వంటి ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చిందన్నా మంత్రి, ఉద్యోగులు తాము ఉద్యమ సమయంలో కొంత అధిక సమయం ఏక్కువ పనిచేసి తెలంగాణ పునర్మినానికి కలిసి వస్తామన్నా మాటను అయన గుర్తు చేశారు. అట్టడుగు స్ధాయి దాక ప్రజలకు ప్రభుత్వ ఫలాలను అందించడంలో పంచాయితీరాజ్ శాఖ ప్రముఖ పాత్ర వహిస్తుందని, అందుకే తమ శాఖ నుంచే సమయపాలన పాటించాలనే ప్రయత్నం చేస్తున్నామన్నారు. సచివాలయంలోని అదికారుల నుంచి జిల్లాలొని ప్రతి ఓక్క పంచాయితీ రాజ్ శాఖ ఉద్యోగులు (యంపిడివోలు,ఈవో, ఇతర పంచాయితీ రాజ్ ఉద్యోగులు) సమయ పాలన పాటించాలని, క్రీయాశీలంగా పనిచేయాలని, ప్రజలకి అందుబాటులో ఉండాలని కోరారు. తాము కొత్త రాష్ర్టంలో ఉన్నామని గుర్తుంచుకోవాలని, ప్రజలకి ప్రభుత్వం మీద ఉన్న ఆశలను నిలబెట్టెందుకు ఉద్యోగులు క్రియాశీలంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఉద్యోగులతో కలసి పని చేసేందుకు తాము సిద్దంగా ఉన్నామని, ఉద్యోగుల సహకరించాలన్నారు. ఉద్యోగుల సమయపాలనపై క్రమంతప్పకుండా తనిఖీలు చేపడుతామన్నారు. తన అకస్మిక తనీఖీలు కొనసాగుతాయన్నా మంత్రి, మరోసారి ఉద్యోగుల ఆలస్యంగా వస్తే ప్రభుత్వం కఠినంగా ఉంటుందని హెచ్చరించారు.

తమ శాఖ నుంచే సంస్కరణలు మెదలు కావలన్నా ఉద్ధ్యేశ్యంతో తన పరిధిలో ఉన్న ఐటి శాఖలో బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశ పెట్టనున్నట్టు తెలిపారు. తమ శాఖలో తెలంగాణ పల్లె ప్రగతి, నూతన పించన్ల కార్యక్రమాలు చేపడుతున్నందునా పంచాయితీ రాజ్ ఉద్యోగులు సమయపాలన పాటించాలని ఉద్యోగులను కోరారు.  ముఖ్యమంత్రి అనుమతి ఇస్తే ఇతర శాఖల్లో ఈ విధానాన్ని పెట్టే అంశాన్ని పరీశీలిస్తామన్నారు. ఈ ఆకస్మిక తనీఖీలో పంచాయితీరాజ్ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్ తోపాటు సెర్ప్ సియివో మురళి ఉన్నారు.

Screenshot_2014-10-30-12-20-35

Advertisement