సెన్సార్ కార్య‌క్ర‌మాల్లో ఓ ముగ్గురి క‌థ‌

0
Advertisement

Web-Banner_03

Advertisement

హైదరాబాద్, నవంబర్ 10 (టెలిమీడియా) : నూత‌న న‌టీన‌టులు ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా ద‌యా పిక్చ‌ర్స్ ప‌తాకంపై ద‌య ద‌ర్శ‌కుడిగా రూపొందిన చిత్రం ఓ ముగ్గురి క‌థ .. హైద‌రాబాద్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో ఓ ముగ్గురు యువ‌కులు త‌మ జీవితాల‌ను ఎలా ప్రారంభించారు. వారి జీవిత ప్ర‌యాణం ఎలా జ‌రిగింది అనేది ప్ర‌ధానాంశం. ఈ సినిమా షూటింగ్ పోస్టు ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం సెన్సార్ జ‌రుపుకుంటోంది.ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు ద‌యా మాట్లాడుతూ ఎంతో వ్య‌య ప్ర‌యాస‌లు ఓర్చి రూపొందించిన ఈ సినిమాను విడుద‌ల చేయ‌డానికి మేము ఓ కొత్త ప‌ద్ద‌తిలో  ముందుకు సాగుతున్నాము. ఈ సినిమా పేరుఉన్న కొన్ని టీష‌ర్టుల‌ను మా వెబ్ సైట్ ద్వారా అమ్మ‌కానికి పెట్టాము.. అవి అమ్మ‌గా వ‌చ్చిన డ‌బ్బుతో సినిమాకు ప‌బ్లిసిటీ చేసి విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నాము. మేము చేస్తున్న ఈ ప్ర‌యోగానికి మంచి స్పంద‌న వ‌స్తోంది. మా ప్ర‌య‌త్నం విజ‌య‌వంతం అవుతోంది. మా సినిమా విడుద‌ల త‌రువాత చిన్న సినిమాలు తీసి విడుద‌ల చేయ‌డానికి ప్ర‌య‌త్నించే వారు ఈ దారిని ఎన్నుకుంటే సినిమాను విజ‌య‌వంతంగా విడుద‌ల చేసుకోవ‌చ్చు అని తెలుసుకుంటారు.మా ప్ర‌య‌త్నం చాలా మందికి మార్గ‌ద‌ర్శ‌కం అవుతుంది అని అన్నారు.

ఈ సినిమాకు సంగీతంః సురేష్‌యువ‌న్‌, ఫోటోగ్ర‌ఫిః ఉద‌య్ గుర్రాల‌, నిర్మాత‌లుః కె.న‌రేంద‌ర్ రెడ్డి, కె.వ‌ర‌ల‌క్ష్మి, క‌థ, స్ర్కీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వంః ద‌య‌.(ద‌యాక‌ర్ రెడ్డి)

CMYK_Poster_1

Poster_1A

Poster_1B

Advertisement