సెన్సార్ పూర్తి చేసుకుని ఫిబ్రవరి 20న విడుదలవుతున్న ‘బందిపోటు’

0
Advertisement

SRI_1466

Advertisement

ఇవివి సినిమా బ్యానర్ పై అల్లరి నరేష్, ఈషా హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ’బందిపోటు‘. ఇప్పటి వరకు డిఫరెంట్ కామెడితో తెలుగు ప్రేక్షకులను నవ్వించిన టాలీవుడ్ కామెడి హీరో అల్లరి నరేష్ రాబిన్ హుడ్ తరహా కథాంశంతో ‘దొంగల్ని దోచుకో’ అనే కాన్సెప్ట్ తో మరోసారి నవ్వులు విరబూయించనున్నారు. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రాజేష్ ఈదర ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని ఈ ఫిబ్రవరి 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.  ఈ సందర్భంగా చిత్రయూనిట్ సినిమా ప్రమోషన్స్ ను డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. అందులో భాగంగా సినిమా విడుదలకు ముందే ప్రేక్షకులను చిత్రయూనిట్ కలవబోతున్నారు.  ఈ టూర్ ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14న ప్రారంభం అవుతుంది. ఈ సందర్భంగా..

చిత్రనిర్మాత ఈదర రాజేష్ మాట్లాడుతూ ‘’నాన్నగారు స్టార్ట్ చేసిన ఇవివి సినిమా బ్యానర్ లో ప్రెస్టీజియస్

 మూవీస్ చేయాలనే ఆలోచనతో బందిపోటు చిత్రాన్ని నిర్మించాం. మా సంస్థ నుండి సినిమా వస్తుందంటే ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూడాలనేది మా కోరిక. ఈ బందిపోటు చిత్రం మా బ్యానర్ వాల్యూను పెంచే విధంగా ఉంటుంది. సినిమా సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సినిమాని ఈ ఫిబ్రవరి 20న విడుదల చేస్తున్నాం. అలాగే విడుదలకు ముందే డిఫరెంట్ గా ఈ సినిమా ప్రమోషన్ ను ప్లాన్ చేస్తున్నాం. ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14న ఈ ప్రమోషనల్ కార్యక్రమం ఉదయం 11 గంటలకు ప్రారంభం అవుతుంది. అలాగే 15 ఫిబ్రవరిన సాయంత్రం 6 గంటలకు విజయవాడ కళావాహినిలో ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ వేడుక జరుగుతుంది. ఈ వేడుకలో చిత్రయూనిట్ పాల్గొన్ననున్నారు’’ అన్నారు.

SRI_5797

Advertisement