3620 మంది పోలీసు కానిస్టెబుళ్ళ నియామకానికై ముఖ్యమంత్రి అనుమతి

0
Advertisement

 హైదరాబాద్, ఫిబ్రవరి 20 (టెలిమిడియా) : పోలీస్ శాఖలో 3620 మంది కానిస్టేబుల్ డ్రైవర్ల నియామకానికై ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నేడు అనుమతి ఇచ్చారు. రాష్ట్ర డిజిపి అనురాగ్ శర్మ, నగర పోలీస్ కమీష్ నర్ మహేందర్ రెడ్డి లు ఇరువురు ముఖ్యమంత్రిని కలిసి కానిస్టేబుల్  డ్రైవర్ల నియామకానికై ఇచ్చిన ప్రతిపాదనలను యధావిధిగా ఆమోదించారు.  పోలీస్ శాఖకు ఇటీవలే కొత్త వాహనాలను సమకూర్చామని దానికి కావలసిన డ్రైవర్ల ను కూడా అవసరమయిన మేరకు సమకూర్చాల్సి ఉన్నందున ఆమోదించామని తెలిపారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు పోలీస్ శాఖకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలు మరియు వాటి అమలుతీరును ఆయన వారితో సమీక్షించారు. 

Advertisement

POLICE DEPT (1)

Microsoft Word - -2-2015_1_ PRESS NOTE _10_.docx

Advertisement