బాపు అంత్యక్రియలు పూర్తి..బాపు కి ఘనంగా ఏపి అసెంబ్లి నివాళి

0
Bapu body
Advertisement

విజయవాడలో బాపు పేరుపై కళామందిర్ నిర్మాణం

Advertisement

Bapu bodyదర్శక బ్రహ్మ, గీతల మాంత్రికుడు బాపు పార్దీవ దేహానికి నేడు మంగళవారం చెన్నైలోని బీసెంట్ రోడ్లోని విద్యుత్ స్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తి అయినయి. సినిరంగ దిగ్గాలన్ని తరలివచ్చి ఆయన శవయాత్రలో పాల్గొన్నరు. ఆయన అనారోగ్యంతో చెన్నైలోని ప్రయివేటు ఆసుపత్రిలో ఆదివారం తుదిస్వాశ విడిచారు. బాపు మృతితో దిగ్బ్రాంతికిలోనైన తెలుగు సినీ రంగం తోపాటుగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లి ఘనంగా నివాళులు అర్పించింది. నిన్న హైదరబాదులో సమావేశం అయిన అస్సెంబ్లి బాపు మృతి పట్ల ఘనంగా నివళులర్పిస్తు తీర్మానాన్ని ఆమోదించింది. తీర్మానంపై చర్చ సందర్భంగా ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతు ఆయన మృతి చలనచిత్ర రంగానకి తీర్చలేని, పూడ్చలేని లోటని, త్వరలోనే ఆయన పెరుపై విజయవాడలో రవీంద్రభారతి తరహాలో ఒక అల్ట్రామడ్రన్ సాంస్కృతిక మందిరాన్ని నిర్మిస్తామని ప్రకటించారు.

ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతు బాపు మృతి తెలుగు జాతికే తీరని లోటని పేర్కొన్నారు. తీర్మానం ఆమొదించిన వెంటనే అసెంబ్లి రేపటికి వాయిదాపడింది.

తెలుగు సినీ ప్రముఖులంతా బాపుకి నివాలులర్పించడానికి చెన్నైకి బయలుదేరి వెళ్ళారు. ఆందులో ప్రముఖ హెరో బాలక్రిష్ణ, బాలసుబ్రమణ్యం, మోహన్ బాబు, దర్శకేంద్రుడు రాఘవేందర్ రావ్, శత సినీ దర్శకుడు దాసరి నారాయణ రావ్తో పాటు నిర్మాత,పారిశ్రామిక వేత్త పెరల్ పొట్లూరి వరప్రసాద్, రామానాయుడు లాంటి దిగ్గాజాలంతా ఆయన పార్దీవ దేహన్ని దర్షించిన వారిలో ఉన్నరు. పలువురు మాట్లాదుతు దిగ్దర్శకుడు బాపు మరణంతో మళ్లీ అలాంటి సినిమాలు రావని, అలాంటి కళాఖండాలు ఇక చూడలేమని ఆవేదన వ్యక్తంచేసారు. చిత్రకారుడిగా, చలనచిత్రకారుడిగా బాపు అజరామరమైన కీర్తి ప్రతిష్టలు గడించారన్నారు. ఇవ్వాళ ఎంతో ఉన్నత స్థాయిలో వున్న ఎందరో నటులు బాపు చెక్కిన శిల్పాలేనన్నారు. తెలుగు మాట, తెలుగుపాట..తెలుగుదనం ఉట్టిపడే సినిమాలు కేవలం బాపు చేతిలో రూపుదిద్దుకున్నవేనని అభిప్రాయపడ్డారు. సాక్షి నుంచి శ్రీరామరాజ్యం వరకు బాపు ఏ సినిమా తీసినా, జోనర్ ఏదయినా అది ఓ కళాఖండమే అని పేర్కొన్నారు.

బాపు కి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నరు. భార్య రెండు సంవత్సరాలకిందే కాలం చేసింది. గత కొన్ని సంవత్సారాలుగా బాపు అనారొగ్యంతో భాదపడుతాఉన్నరు. గత రాత్రి ఆయనకు గుండె పోటు రావడంతో కుటుంభ సభ్యులు దగ్గరిలోని ఒక ప్రయివేటు ఆసుపత్రికి తరలించినారు. అక్కడే ఆయన తుది శ్వాస వదిలారు. బాపు పెద్ద కొడుకు జపాన్ నుంచి రావటానికి ఆలస్యం అయినందువలన నేదు ఆయన అంత్యక్రియలు జరిగాయి.

Advertisement