Current Affairs5

uma

రేవూరు ఉమా మహేశ్వర రావు
ప్రిన్సిపాల్
రచన కాలేజీ అఫ్ జర్నలిజం (ఓయూ)
హైదరాబాద్

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]33). కేంద్ర‌ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన ప్ర‌మాద‌ భీమా ప‌థ‌కం పేరు ఏమిటి?
Ans : కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన ప్ర‌మాద బీమా ప‌థ‌కం పేరు ప్ర‌ధాన‌మంత్రి సుర‌క్ష బీమా యోజ‌న‌.[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]34). న‌లంద విశ్వ‌విద్యాల‌యం కొత్త కుల‌ప‌తిగా ఎంపికైన వ్య‌క్తి ఎవ‌రు?
Ans :న‌లంద విశ్వ‌విద్యాల‌యం కొత్త కుల‌ప‌తిగా  సింగ‌పూర్ విదేశాంగ‌శాఖ మాజీ మంత్రి జార్జి యో ఎంపిక‌య్యారు. ఇప్ప‌టివ‌ర‌కు  ఆయ‌న న‌లంద విశ్వ‌విద్యాల‌యం పాల‌క మండ‌లి స‌భ్యుడుగా ఉన్నారు.[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]35). స‌తీష్‌ధావ‌న్ అంత‌రిక్ష ప‌రిశోధ‌నా కేంద్రం(షార్‌) డైర‌క్ట‌ర్‌గా నియ‌మితులైన వారు ఎవ‌రు?
Ans :నెల్లూరు జిల్లాలోని షార్ కేంద్రం డైర‌క్ట‌ర్‌గా పి. కున్హి కృష్ణ‌న్ బాధ్య‌త‌లు చేప‌ట్టారు.[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]36).2015 సంవ‌త్స‌రానికి సంబంధించి రూల్ ఆప్ లా ఇండెక్స్‌లో భార‌త్ ఎన్న‌వ స్థానంలో ఉంది?
Ans :2015 సంవ‌త్స‌రానికి సంబంధించి రూల్ ఆఫ్ లా ఇండెక్స్‌ను అమెరికాకు చెందిన వ‌ర‌ల్డ్ జ‌స్టిస్ ప్రాజెక్టు విడుద‌ల చేసింది. దీనిప్ర‌కారం మ‌న దేశం 59 వ స్థానంలో ఉంది.[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]37).2015 సంవ‌త్స‌రానికి సంబంధించి ప‌ర్యావ‌ర‌ణ ప్ర‌జాస్వామిక ఇండెక్స్‌లో మ‌న దేశం స్థానం ఎంత‌?
Ans :2015 సంవ‌త్స‌రానికి సంబంధించి ప‌ర్యావ‌ర‌ణ ప్ర‌జాస్వామిక ఇండెక్స్‌లో మ‌న దేశం 24 వ స్థానంలో ఉంది.[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]38).త‌ప్పిపోయిన పిల్ల‌ల ఆచూకీ తెలుసుకునేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన వెబ్‌సైట్ ఏది?
Ans :త‌ప్పిపోయిన పిల్ల‌ల ఆచూకీ తెలుసుకునేందుకు కేంద్ర‌ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన వెబ్‌సైట్ పేరు ఖోయా పాయా.[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]39).కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ అకౌంట్స్‌గా నియ‌మితులైన వ్య‌క్తి ఎవ‌రు?
Ans :కేంద్ర ఆర్థిక మంత్రిత్వ‌శాఖ‌లో కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ అకౌంట్స్‌గా ఎం.జె.జోసెఫ్ నియ‌మితుల‌య్యారు.[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]40).ఎన్విరాన్‌మెంట‌ల్ డెమాక్ర‌సి ఇండెక్స్‌లో భార‌త్ స్థానం ఎంత‌?
Ans :ఎన్విరాన్‌మెంట‌ల్ డెమాక్ర‌సీ ఇండెక్స్‌లో మ‌న దేశం 24 వ స్థానంలో ఉంది.[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]41).ప్ర‌ధాన‌మంత్రి జ‌న్ ధ‌న్ యోజ‌న‌లో నూరుశాతం విజ‌యం సాధించిన రాష్ట్రం ఏది?
Ans :ప్ర‌ధాన‌మంత్రి జ‌న్ ధ‌న్  యోజ‌న కింద నూరుశాతం విజ‌యం సాధించిన రాష్ట్రం మేఘాల‌య‌. ఈ రాష్ట్రంలోని అన్ని కుటుంబాల‌కు బ్యాంకు ఖాతాలు ఉన్నాయి.[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]42).ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ 68 వ సెష‌న్‌ అధ్య‌క్ష‌ప‌ద‌విని ద‌క్కించుకున్న దేశం ఏది?
Ans :ప్ర‌పంచ ఆరోగ్య సంస్త 68 వ  సెష‌న్  అధ్య‌క్ష‌ ప‌ద‌విని భార‌త దేశం ద‌క్కించుకుంది. 19 సంవ‌త్స‌రాల విరామం త‌ర్వాత మ‌న దేశానికి ఈ ప‌ద‌వి ద‌క్కింది.[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]43).దూర‌ద‌ర్శ‌న్ కిసాన్ ఛాన‌ల్ ఎప్పుడు ప్రారంభ‌మైంది?
Ans :దూర‌ద‌ర్శ‌న్ కిసాన్ ఛాన‌ల్‌ను ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ 2015 మే 26న ప్రారంభించారు.[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]44).మిజోరం రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌గా నియ‌మితులైన వ్య‌క్తి ఎవ‌రు?
Ans :మిజోరం రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌గా లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ (రిటైర్డ్‌) నిర్భ‌య్ శ‌ర్మ మే 26న బాధ్య‌త‌లు స్వీక‌రించారు.[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]45).ప్ర‌పంచ వార‌స‌త్వ దినోత్స‌వాన్ని ఎప్పుడు జ‌రుపుకుంటారు?
Ans :ప్ర‌పంచ వార‌స‌త్వ దినోత్స‌వాన్ని ఏప్రిల్ 18న జ‌రుపుకుంటారు.[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]46).వ‌ర‌ల్డ్ ప్రెస్ డే ని ఎప్పుడు జ‌రుపుకుంటారు?
Ans :వ‌ర‌ల్డ్ ప్రెస్ డేని మే 3 వ తేదీన జ‌రుపుకుంటారు.[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]47).ఐపిఎల్ కుంభ‌కోణంపై ద‌ర్యాప్తున‌కు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన క‌మిటీ ఏది?
Ans :ఐపిఎల్ కుంభ‌కోణంపై  ద‌ర్యాప్తున‌కు సుప్రీంకోర్టు వివేక్ ప్రియ‌ద‌ర్శి నేతృత్వంలోని క‌మిటీని నియ‌మించింది.[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]48).సిపిఎం కొత్త జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎవ‌రు?
Ans : సిపిఎం కొత్త జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా సీతారాం ఏచూరి ఎన్నిక‌య్యారు.[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]49).దేశ కొత్త ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ (సిఇసి)ఎవ‌రు?
Ans : దేశ 20 వ ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌ (సిఇసి) గా న‌సీమ్ జైదీ 2015 ఏప్రిల్ 19న బాధ్య‌త‌లు చేప‌ట్టారు.[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]50).మధ్యాన్ని మాన్పించేందుకు కేర‌ళ ప్ర‌భుత్వం చేప‌ట్టిన కార్య‌క్ర‌మం పేరు ఏమిటి?
Ans : కేర‌ళ ప్ర‌భుత్వం మ‌ద్యం ర‌హిత స‌మాజాన్ని సాధించేందుకు ప్ర‌జ‌ల‌లో అవ‌గాహ‌న క‌ల్పించేందుకు సుబోధం పేరుతో ప్ర‌చార కార్య‌క్ర‌మాన్ని ఏప్రిల్ 19న ప్రారంభించింది.[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]51).ఎల‌క్ట్రానిక్ వ్య‌ర్థాలు భారీగా పోగుప‌డిన దేశాల‌లో భార‌త్ ఎన్నోస్థానంలో ఉంది?
Ans : ఎల‌క్ట్రానిక్ వ్య‌ర్థాలు భారీగా పోగుప‌డిన దేశాల‌లో భార‌త్ 2014 లో ఐద‌వ స్థానంలో ఉంది. గ‌త ఏడాది సుమారు 17 ల‌క్ష‌ల ట‌న్నుల ఈ -వ్య‌ర్థాలు  భార‌త్‌లో జ‌మ అయిన‌ట్టు ఐక్య‌రాజ్య‌స‌మితి అధ్య‌య‌న నివేదిక తెలిపింది.[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]52). ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సుగంధ ద్ర‌వ్యాల పార్కును ఎక్క‌డ ఏర్పాటు చేస్తున్నారు?
Ans : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సుగంధ ద్ర‌వ్యాల పార్కును గుంటూరుజిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు.[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]53). గాంధీ శాంతి బ‌హుమ‌తిని 2014 సంవ‌త్స‌రానికి గెలుచుకున్న సంస్థ ఏది?
Ans : 2014 సంవ‌త్స‌రానికి గాంధీ శాంతి బ‌హుమ‌తిని గెలుచుకున్న సంస్థ ఇస్రో. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ అధ్య‌క్ష‌త‌న గ‌ల క‌మిటీ ఈ ఎంపిక‌ను ప్ర‌క‌టించింది.[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]54). 62వ జాతీయ చ‌ల‌న చిత్ర అవార్డుల‌లో ఉత్త‌మ ద‌ర్శ‌కుడిగా ఎంపికైన వ్య‌క్తి ఎవ‌రు?
Ans : 62వ జాతీయ చ‌ల‌న‌చిత్ర అవార్డుల‌లో ఉత్త‌మ ద‌ర్శ‌కుడిగా శ్రీ‌జిత్ ముఖ‌ర్జీ( బెంగాలీ) ఎంపిక‌య్యారు.[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]55). ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మ‌న్ ఎవ‌రు?
Ans : ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మ‌న్ జ‌స్టిస్ చంద్ర‌మౌళి ప్ర‌సాద్‌.[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]56). జాతీయ చ‌ల‌న  చిత్ర అవార్డుల‌లో ఉత్త‌మ తెలుగు సినిమాగా ఎంపికైన సినిమా ఏది?
Ans : 62వ జాతీయ చ‌ల‌న‌చిత్ర అవార్డుల‌లో ఉత్త‌మ తెలుగు సినిమాగా చంద‌మామ క‌థ‌లు ఎంపికైంది.[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]57). తెలంగాణ‌లో సాహిత్య రంగంలో 2015 ఉగాది పుర‌స్కారాల‌కు ఎంపికైన వ్య‌క్తి ఎవ‌రు?
Ans : తెలంగాణలో సాహిత్య రంగంలో 2015 ఉగాది పుర‌స్కారానికి ముదిగంటి సుజాతారెడ్డి ఎంపిక‌య్యారు.[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]58). తెలంగాణ ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ ఛైర్మ‌న్‌గా నియ‌మితులైన వ్య‌క్తి ఎవ‌రు?
Ans : తెలంగాణ ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ ఛైర్మ‌న్‌గా మాజీ డిజిపి పేర్వారం రాములు నియ‌మితుల‌య్యారు.[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]59). ప‌ట్టిసీమ ప్రాజెక్టుకు నీటిని ఎక్క‌డినుంచి స‌మ‌కూర్చుకోవాల‌ని నిర్ణ‌యించారు?
Ans : రాయ‌ల‌సీమ‌కు నీటిని స‌ర‌ఫ‌రా చేసే ప‌ట్టిసీమ ప్రాజెక్టుకు గోదావ‌రి వ‌ర‌ద జ‌లాల‌నుంచి నీటిని స‌మ‌కూర్చుకుంటారు.[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]60). ఇంటర్నేషనల్ మానిటరి ఫండ్ (ఐఎంఎఫ్) అదిప‌తి ఎవ‌రు?
Ans : ఇంటర్నేషనల్ మానిటరి ఫండ్ (ఐఎంఎఫ్) అదిప‌తి క్రిస్టినా ల‌గార్డే.[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]61). ప్ర‌సార‌భార‌తి ఛైర్మ‌న్ ఎవ‌రు?
Ans : ప్ర‌సార‌భార‌తి ఛైర్మ‌న్ ఎ.సూర్య‌ప్ర‌కాశ్‌.[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]62). ప్ర‌పంచ ఆర్థిక వేదిక (డ‌బ్ల్యుఈఎఫ్‌) విడుద‌ల చేసిన యువ అంత‌ర్జాతీయ నేత‌ల జాబితాలో స్థానం పొందిన‌వ్య‌క్తి?
Ans : ప్ర‌పంచ ఆర్థిక వేదిక (డ‌బ్ల్యుఈఎఫ్‌) విడుద‌ల చేసిన యువ అంత‌ర్జాతీయ నేత‌ల జాబితాలో స్థానం పొందిన వారు స్మృతి ఇరాని.[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]63).కేంద్ర స‌ర్వీసుల‌లోకి రాష్ట్ర కేడ‌ర్ అధికారుల‌ను ఎంపిక‌చేసుకునేందుకు  వ‌యోప‌రిమితిని ఎన్ని సంవ‌త్స‌రాల‌కు పెంచారు?
Ans : కేంద్ర స‌ర్వీసుల‌లోకి రాష్ట్ర కేడ‌ర్ అధికారుల‌ను ఎంపిక‌ చేసుకునేందుకు వ‌యోప‌రిమితిని 54 సంవ‌త్స‌రాల నుంచి 56 సంవ‌త్స‌రాల‌కు పెంచారు.[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]64). అమెరికా విద్యా మండ‌లి బోర్డఆఫ్ డైర‌క్ట‌ర్స్ చైర్‌ప‌ర్స‌న్‌గా ఎంపికైన భార‌తీయ మ‌హిళ‌?
Ans : అమెరికా విద్యా మండ‌లి బోర్డఆఫ్ డైర‌క్ట‌ర్స్ చైర్‌ప‌ర్స‌న్‌గా ఎంపికైన భార‌తీయ మ‌హిళ రేణూ ఖ‌రార్‌.[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]65) ఫిలిప్పైన్స్ దేశ  పుర‌స్కారం ఫిలిప్పైన్స్ కాంగ్రెస్ అవార్డును అందుకున్న వ్య‌క్తి?
Ans : హైద‌రాబాద్ ప‌టాన్ చెరులోని మెట్ట‌పంట‌ల ప‌రిశోధ‌నా కేంద్రం (ఇక్రిశాట్‌)  డైర‌క్ట‌ర్  డి.జి.విలియం కు ఈ అవార్డు ప్ర‌దానం చేశారు.[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]66) ఇండియ‌న్ సైన్స్ కాంగ్రెస్ స‌మావేశాలు 2015లో ఎక్క‌డ జ‌ర‌గ‌నున్నాయి?
Ans : ముంబాయిలోని ముంబాయి యూనివ‌ర్సిటీ 2015 సైన్స్ కాంగ్రెస్ స‌మావేశాల‌కు వేదిక కానుంది.[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]67) యాష్‌చోప్రా మెమోరియ‌ల్ అవార్డ్ 2014కు ఎంపికైన న‌టుడు?
Ans : అమితాబ్ బ‌చ్చ‌న్‌. ఈ అవార్డును గ‌త ఏడాది నెల‌కొల్పారు.[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]68) రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్ర‌ధాన ఆర్థిక స‌ల‌హాదారు?
Ans : అర‌వింద్ సుబ్ర‌మ‌ణియ‌న్‌.[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]69) పండిత్ మ‌ద‌న్ మోహ‌న్ మాల‌వ్య సంపాద‌క‌త్వం వ‌హించిన ప‌త్రిక‌?
Ans : నేష‌న‌లిస్ట్ వీక్లీ.[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]70) ఫిక్కి కొత్త అధ్య‌క్షురాలు?
Ans : జ్యోత్స్న సూరి.[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]71) తెలుగుభాష‌కు సంబంధించి 2014 సంవ‌త్స‌రానికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు ఎవ‌రికి ప్ర‌క‌టించారు?
Ans :రాచ‌పాళెం చంద్ర‌శేఖ‌ర రెడ్డి కి ప్ర‌క‌టించారు.[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]72) భార‌తీయుల పేర్లు నిక్షిప్తం చేసిన మైక్రోచిప్‌ను అంత‌రిక్షంలోకి తీసుకువెళ్లి తిరిగివ‌చ్చిన వ్యోమ‌నౌక‌?
Ans : మాన‌వ‌ర‌హిత వ్యోమ‌నౌక ఒర‌య‌న్‌, ల‌క్షాడెభ్బైవేల మంది భార‌తీయుల పేర్లు నిక్షిప్తం చేసిన మైక్రోచిప్‌ను అంత‌రిక్షంలోకి తీసుకెళ్లి తిరిగి సుర‌క్షితంగా తీసుకువ‌చ్చింది.[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]73) జాతీయ విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ ఛైర్‌ప‌ర్స‌న్‌గా ఎవరు వ్య‌వహ‌రిస్తారు?
Ans : ప్ర‌ధాన‌మంత్రి జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థకు చైర్మన్ గా వ్యవహరిస్తారు.[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]74) జాతీయ విపత్తుల నిర్వ‌హ‌ణ సంస్థకు కొత్త‌గా నియ‌మితులైన స‌భ్యులు?
Ans : జాతీయ విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ‌(ఎన్‌.డి.ఎం.ఎ)లో క‌మ‌ల్ కిశోర్‌, ఎన్‌.సి. మార్వాహ్‌,డి.ఎన్‌.శ‌ర్మ నియ‌మితుల‌య్యారు. తొలిసారిగా సంబంధిత అంశాల నిపుణుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోర‌గా వ‌చ్చిన 82 మంది ద‌ర‌ఖాస్తుల‌నుంచి కేంద్రం వీరిని ఎంపిక చేసింది.[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]75) ఐక్య రాజ్య సమితిలో పాకిస్తాన్ దూతగా  నియమితులైన వ్యక్తి?
Ans : పాకిస్తాన్ జర్నలిస్ట్ ,దౌత్యవేత్త మలేహ లోధి.[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]76) లండన్ క్లాసిక్ చెస్ టైటిల్ 2014 విజేత ?
Ans : విశ్వనాథన్ ఆనంద్ (లండన్ లో జరిగిన పొటీలలో మైఖేల్ ఆడమ్స్ ను ఓడించి టైటిల్ గెలుచుకున్నాడు).[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]77) లండన్ నేచురల్ హిస్టరీ మ్యూజియమ్ కు కొత్త ట్రస్టీ గా నియమితులైన వ్యక్తీ? 
Ans : మహీంద్రా గ్రూప్ చైర్మెన్ ఆనంద్ మహీంద్రా .2015 జనవరి నుంచి నాలుగు సంవత్సరాలు  ఆయన ఈ పదవిలో వుంటారు.[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]78) జాతీయ సుపరిపాలనా దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించాలని   ఎన్ డి ఎ ప్రభుత్వం నిర్ణయించింది ?
Ans : డిసెంబర్ 25 వ తేదీ .[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]79) తెలంగాణా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడుగా ఎవరు నియమితులయ్యారు?
Ans : తెలంగాణా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడుగా మహబూబ్ నగర్ జిల్లా వనపర్తికి చెందిన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నియమితులయ్యారు.[/box]

1