రేపు పాలెం వాగు ప్రాజెక్టును ప్రారంభించనున్న మంత్రులు తుమ్మల, హరీష్ రావు

0

 

 

అన్ని అవాంతరాలు అధిగమించి ఎట్టకేలకు ఖమ్మం జిల్లాలోని పాలెంవాగు మధ్య తరహా  ప్రాజెక్టు పూర్తయ్యింది.వెంకటాపురం మండలంలో 32 గ్రామాలు, వాజేడు మండలంలో 7  గ్రామాల్లో 10,132 ఎకరాలకు సాగునీరందనున్నది.

సోమవారం మంత్రులు హరీశ్ రావు, తుమ్మల నాగేశ్వరరావు దీనిని ప్రారంభించ నున్నారు. అటవీశాఖప్రాజెక్టు అనుమతులు సాధించి యుద్ధ ప్రాతిపదికన పనులు సాగించడంతో పాలెంవాగు పూర్తయింది. తెలంగాణ ప్రభుత్వం పాలెంవాగు ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా  తీసుకొని 228 కోట్లతో  పనులు చేయించింది. దీంతో సాగునీటి ప్రాజెక్టుల సిగలో మరో ప్రాజెక్టు సోమవారం చేరినట్టు అయ్యింది.

దిగి జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని వెంకటాపురం(నూగూరు) మండలం పాలెం వాగు ప్రాజెక్టును  గత ఏప్రిల్ 17న  మంత్రి తుమ్మలతో కలిసి  సందర్శించారు. 2005లో అప్పటి ప్రభుత్వం పాలెంవాగు ను 70 కోట్ల రూపాయల వ్యయంతో మధ్యతరహా ప్రాజెక్టుగా  చేపట్టింది. ఈ ప్రాజెక్టుకు అనుబంధంగా 15 కెనాల్స్‌ను ఏర్పాటు చేశారు. అయితేఇందుకు గాను అటవీ ప్రాంతం గుండా ఈ కెనాల్‌ వెళ్లేందుకు అ ప్పట్లో కేంద్ర అటవీ శాఖ నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అప్పటి ప్రభుత్వం దీన్ని తీవ్రంగా తీసుకోకుండా నిర్లక్ష్యం చేసింది. 

ఈ ఇబ్బందులను అధిగమించేందుకు స్వయంగా మంత్రి హరీష్‌రావు రంగంలోకి దిగి సుమారు 22.55 కోట్లు చెల్లించి అటవీశాఖ భూమిని తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేయించారు. ఇందులో 11 కెనాల్స్‌కు ఎలాంటి అభ్యంతరాలు లేకుండాపనులు పూర్తయినా మరో నాలుగు కెనాల్స్‌కు అటవీశాఖ అభ్యంతరాలు తెలిపింది. దీంతో 200 కోట్లకు పైగా ఖర్చు చేసినప్పటికీ పాలెంవాగు ప్రాజెక్టు పూర్తి స్థాయిలో రైతులకు అందుబాటులోకి రాలేకపోయింది.  ప్రాజెక్టును పూర్తిచేసి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్లింది. 

పాలెంవాగు ప్రాజెక్ట్ ఈపీసీ విధానంలో జరిగిన నష్టం  చెప్పడానికి ఈ ప్రాజెక్ట్ ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు.  2006 ఆగస్టులో ఒకసారి, 2008 ఆగస్టు లో మరోసారి భారీ వర్షాలు, వరదలకు ఈ ప్రాజెక్ట్ ఆనకట్ట  కొట్టుకుపోయింది. నాసిరకపునిర్మాణాలతోపాటు, ఇంజినీరింగ్, ఈపీసీ విధానాల లోపాలవల్ల ఈ ఘటనలు జరిగాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్రంలోని అసంపూర్తి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి గాను 2015 అక్టోబర్ 8న చర్యలు చేపట్టింది. 2017 మార్చి లో పాలెంవాగు పూర్తి కిగాను 221.48 కోట్లతో మళ్ళీ పరిపాలన అనుమతి ఇచ్చింది. పాలెంవాగు ప్రాజెక్టు పూర్తి స్థాయినీటినిల్వసామర్ధ్యం1.260.టి.ఎం.సి.లు.ప్రాజెక్టు మట్టికట్ట పొడవు 545 మీటర్లు.ప్రధాన కాలువ కు 15 ఉప కాలువలున్నాయి. మొత్తం ఉప కాలువల పొడవు 34.424 కిలోమీటర్లు. పాలెంవాగు పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి  చేసేందుకు మంత్రి హరీశ్ రావు ప్రతి వారం సంబంధిత ఇరిగేషన్ ఇంజనీర్లు, aకాంట్రాక్టర్లతో సమీక్షించడంతో ఫలితాలు కనిపిస్తున్నయి.