స్థానిక సంస్థలకు అధికారాలు, బాధ్యతలు ఇవ్వడంలో తెలంగాణ భేష్ : కేంద్ర కన్సల్టెంట్

0
Advertisement

IMG_3346

Advertisement
  • స్థానిక సంస్థల చేతుల్లో గ్రామాల్లో తాగునీటి సరాఫరా వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుంది
  • కేంద్రం నుంచి తెలంగాణకు ఇన్సెంటివ్ గ్రాంట్ వచ్చే అవకాశం
  • తెలంగాణలో పర్యటించిన కేంద్ర ప్రభుత్వ గ్రామీణ తాగునీటి సరాఫరా విభాగం కన్సల్టెంట్ బల్వీర్ కశ్యప్

స్థానిక సంస్థలకు అధికారాలు,బాధ్యతలు పంచడంలో తెలంగాణ ముందుందని కేంద్ర ప్రభుత్వ గ్రామీణ నీటి సరాఫరా కన్సల్టెంట్ బల్వీర్ కశ్యప్ ప్రశంసించారు. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో స్థానిక సంస్థలకు ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయన్నారు. గ్రామాల్లోని మంచినీటి సరాఫరా వ్యవస్థ నిర్వహణ పంచాయితీలు, స్థానిక తాగునీటి సంఘాలకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల అమలులో మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణ మెరుగ్గా ఉందన్నారు. వరంగల్ జిల్లా ధర్మారావుపేటలో పర్యటించిన బల్వీర్. అక్కడి సర్పంచ్, పంచాయితీ సెక్రటరీ, RWS&S ఇంజనీర్లతో పాటు ప్రజలతో మాట్లాడారు. గ్రామంలో మంచినీటి సరాఫరా పంచాయితీ చేతుల్లోనే ఉందా అని ఆరా తీశారు. దీంతో పాటు స్థానిక సంస్థలకు అధికారాలు బదలాయించినట్టు చూపే జీవోలు, రికార్టులను పరిశీలించారు. ధర్మారావు పేటలో గ్రామీణ తాగునీటి సరాఫరా వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుందని, దీనికి పంచాయితీ, స్థానిక సంస్థల చొరవే కారణమన్న బల్వీర్. ఇదే రీతిలో మిగతా అంశాల్లో కూడా పంచాయితీలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. స్థానిక సంస్థలకు అధికారాలు ఇచ్చే రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక ఇన్సెంటివ్ గ్రాంట్ ఇస్తుందని బల్వీర్ చెప్పారు. రేపు కరీంనగర్ జిల్లా కుమ్మరికుంట, ఖమ్మం జిల్లా జక్యపల్లిలో పర్యటించి అక్కడి నీటి సరాఫరాను పరిశీలిస్తానన్నారు. వరంగల్ జిల్లా పర్యటన ముగించుకుని హైదరాబాద్ వచ్చిన బల్వీర్ RWS&S ఈ.ఎన్.సి బి.సురేందర్ రెడ్డి తో సమావేశమయ్యారు. తన పర్యటన విశేషాలను వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సరాఫరాలో RWS&S విభాగం ప్రశంసనీయంగా పనిచేస్తుందన్నారు. తాను గమనించిన విషయాలతో కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదికను అందిస్తానన్నారు. ప్రజలకు తాగునీటి విషయంలో చిన్నపాటి ఇబ్బంది కూడా రాకుండా తమ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుందని. ఇందుకోసం అధిక మొత్తంలో నిధులు కేటాయించిందని సురేందర్ రెడ్డి చెప్పారు. తాగునీటి సమస్యను శాశ్వతంగా రూపుమాపేందుకు తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు అనే బృహత్ పథకాన్ని ప్రారంభించిందన్నారు. ఈ సమావేశంలో RWS&S కన్సల్టెంట్ నర్సింగరావు తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

DSCN4081

Advertisement