టిఅర్ఎస్ గెలుపు చారిత్రక అవసరం

0
Advertisement

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ కి మొట్టమొదటి సారిగా జరుగుతున్నఎన్నికలివి. దీనికొక ప్రత్యేకత ఉంది. హైదరాబాద్ రాష్ట్రం తెలంగాణకు గుండెకాయ వంటిది. భౌగోళికంగా, చారిత్రాత్మికంగా, సామాజికంగా, సాంస్కృతిక పరంగా ఎటుచూసినా, తెలంగాణతో విడదీయరాని బంధం ఈ నగరానిది. 500 ఏండ్లుగా డెక్కన్ పీఠభూమికి రాజధానిగా విరాజిల్లింది. దేశంలోని ప్రధాన నగరాలలో అయిదవ స్తానంలో నిలబడింది. 1902 లోనే ఈ మేరకు బ్రిటిష్ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది.

Advertisement

ఇంతటి ఉత్కృష్ట చరిత్ర కలిగిన ఈ నగరాన్ని వలసపాలకులు 60 యేండ్ల పాటు నంజుకుని తిన్నారు. తెలంగాణ పదాన్ని అసెంబ్లీలో నిషేధించిన తెలుగు దేశం పార్టి అధినేత అయితే నేటికి నగర అభివృద్ధికి తానె కారణమని బీరాలు పోతున్నడు. కాని అదే అభివృద్ధి ముసుగులో యధేచ్చగా జరిగిన దోపిడిని ఇంకా తెలంగాణ వాదులెవరు మరచిపోలేదు. ఇందులో 120 యేండ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్స్ పార్టి పాత్ర కూడా తక్కువేమీ లేదు. ‘జీవో ఔర్ జీనెదో’ నినాదాన్ని ‘లూటో ఔర్ లూటునేదో’ కింద మార్చి వలస పాలకులకు సద్దులు మోసిన ఘన చరిత్ర వారిది. 60 యేండ్ల వలసపాలకుల పాపాలలో ప్రత్యక్ష భాగస్వామ్యం కలిగిన కాంగ్రెస్స్ పార్టి నేడు ‘సేట్లేర్’ అనే పదం వాడకుండా నిషేధం విదిస్తం అని తమ మానిఫెస్టోలో చేర్చడాన్ని చూస్తె అధికారం కోసం ఎంతటి దుస్సాహసానికైన తెగబడుతారని అర్ధం అవుతుంది.

జి హెచ్ ఎం సి ఎలెక్షన్ల సందర్భంగా మిగతా రాజకీయ పార్టీలు కూడా తమతమ మానిఫెస్టొలను విడుదల చేసాయి. అందులోని చాల అంశాలు జి హెచ్ ఎం సి కు సంభంధం లేనివే. ఉదాహరణకు కాంగ్రెస్స్ పార్టి సేట్లేర్ పదాన్ని నిషేదించడం, అందరికి సమాన హక్కులు కల్పించడం, కార్పోరేట్ సంస్థల అభివృద్ధికి పాటుపడటం, విదేశీ విద్యకై సహకారం, ఉచిత పాటశాలల ఏర్పాటు అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిదిలోనివే. జి హెచ్ ఎంసి పరిధిలోనివి కావు. సేట్లేర్ అనే పదాన్ని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం స్పష్టంగా నిర్వచించింది. అయినా సేట్లేర్ పరుపై సేట్లర్లే సంఘాలు, సంస్థలు ఏర్పాటు చేసుకుంటుంటే, కాంగ్రెస్స్ వారికొచ్చే ఇబ్బందేమిటో అర్ధం కావటంలేదు.

అదేవిధంగా తెలుగు దేశం పార్టి హైదరాబాద్ అభివృధికి కేంద్రం నుంచి నిధులు తెస్తామనడం, ఇంటింటికి తాగు నీరు ఉచితంగా అందించడం, నగర వ్యాప్తంగా ఉచిత విఫీ సర్వీసును కల్పించడం, నగరంలోని, మురుగునీరు పారుదల వ్యవస్తను పునర్నిర్మించడం, చైన్ స్నాచింగ్, ఈవ్ టీజింగ్ లను అరికట్టడం అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనివి. ఉదాహరణకు భూగర్భ మురుగు నీరు పార్దాల వ్యవస్థను పునర్నిర్మించాలంటే 10 వేల కోట్లు అవసరం పడుతుంది. చట్ట ప్రకారం 5 కోట్లు దాటితేనే జి హెచ్ ఎం సి కి రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం అవసరం పడుతుంది. అటువంటిది అసెంబ్లీ లో కనీసం ప్రతిపక్ష హోదా కుడా లేని పార్టి ఏ విధంగా పై వాగ్దానాలను అమలుచేయగలుగుతుందో అర్ధం కాని అంశం.

ఇక పాలక టిఅరెస్ పార్టి కూడా ఎం ఎం టి ఎస్, ఓ అర్ అర్, 3500 కిలోమీటర్ల భూగర్భ మురుగు నీటి పారుదల వ్యవస్థ పునర్నిర్మాణం, సోలార్ విధ్యుత్ సరఫరా మొదలయినవన్నీ చెప్పినప్పటికీ అధికారంలో ఉన్న పార్టి కారణం గా ఆ వాగ్దానాలను అమలుపరిచే శక్తి సామర్ధ్యాలు కలిగి ఉంటుంది. అన్నిటికి మించి ఈ మహానగరానికి ప్రస్తుతం కావలసింది ఇక్కడ తెలంగాణ వాదాన్ని కాపాడుతూనే అందరిని సమన్వయ పరుచుకుని పోగలిగే రాజకీయ శక్తి. అది కేవలం ఒక టిఆర్ఎస్ పార్టీకే సాధ్యం అనేది ఇప్పటికే దాని 18 నెలల పాలనలో స్పష్టం అయ్యింది.

అదే విధంగా ఇక నగరంలోని సేట్లర్లకు కూడా ఇప్పటివరకు తెలంగాణ పట్లకాని, టిఅర్ఎస్ పట్ల కాని ఉన్న భ్రమలన్నీ ఇప్పటికే తొలగిపోయాయి. వాస్తవాలు కళ్ళముందు కనపడుతున్నాయి. అనేక మంది సేట్లర్లు కూడా టిఆర్ యస్ కు మద్దతుగా ముందుకొస్తున్నారు. వారందరినీ అక్కున చేర్చుకుని వారికి టికెట్లు ఇచ్చిన ఘనత టి అర్ ఎస్ ది. కేటిఅర్ మాటలలో చెప్పాలంటే ‘టి అర్ ఎస్ ది స్టేట్ ఫైట్ మాత్రమే కాని స్ట్రీట్ ఫైట్ కాదు’ అనేది సుస్పష్టం. కాబట్టి తెలంగాణ వాదం అంటే సేట్లర్లకు వ్యతిరేకమనే భావన మానుకోవాలి. అదేవిధంగా తెలంగాణ వాదానికి సేట్లర్లు వ్యతిరేకమనే భావన కూడా మంచిది కాదు. సిద్దాంత రీత్యా ఈ రెండింటిని సమన్వయపరచే ఏకైక రాజకీయ పార్టి నేడు తెలంగాణ లో టి అర్ ఎస్ పార్టి ఒక్కటే. అందుకే జి హెచ్ ఎం సి ఎలక్షన్లలో తెలంగాణ వాదం విరాజిల్లాలంటే టిఆర్ ఎస్ గెలుపు ఒక చారిత్రిక అవసరం.

Advertisement